Pages

Subscribe:

Tuesday 8 April 2014

రామయ తండ్రీ ఓ రామయ తండ్రీ

             
రామయ తండ్రి, ఓ! రామయ తండ్రి
మా నోములన్ని పండినాయి రామయ తండ్రి
మా సామివంటె నువ్వేలే రామయ తండ్రీ!!
 
౧. తాటకిని ఒక్కేటున కూల్చావంటా!
శివుని విల్లు ఒక దెబ్బకె యిరిశావంట!
పరశురాముడంత వోడ్ని పారదరిమినావంట
ఆ కతలు సెప్పుతుంటె విని ఒళ్ళు మరిచిపోతుంట!!

  ౨. అయ్యా నే వస్తుండా, బాబూ నే వస్తుండా
నీ కాలు దుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట
నాకు తెలుసులే..
నా నావమీద కాలుబెడితె ఏమౌతాదో తంట
దయజూపి ఒక్కసారి కాళ్ళు కడగనీయమంట
మూడు మూర్తులా నువ్వు నారాయణ మూర్తివంట!!

౩. అందరినీ దరిజేర్చు మారాజువే
అద్దరిని జేర్చమని అడుగుతుండావే
నువ్వు దాటలేక కాదులే రామయ తండ్రి
నన్ను దయజూడగ వచ్చావు రామయ తండ్రీ

హైలేసా లేలో హైలేసా!  
హైలేసా లేలో హైలేసా! 
ఓహోహో! ఓ!..ఓ
బృందం: హైలేసా లేలో హైలేసా!


0 comments:

Post a Comment