Pages

Subscribe:

Sunday 24 August 2014

మల్లికా నవమల్లికా

చిత్రం : బంగారు బావ (1980)
సంగీతం : సత్యం
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు


పల్లవి:

మల్లికా ఆ....
మల్లికా... నవ మల్లికా... మదనోత్సవ సంగీత సంచిక
మల్లికా... నవ మల్లికా... మదనోత్సవ సంగీత సంచిక
రగిలే వేసవి రాగమాలికా... మధుర శరదృతు మౌనగీతికా
రగిలే వేసవి రాగమాలికా... మధుర శరదృతు మౌనగీతికా
ప్రేమిక మానస లగ్నపత్రిక ...పులకింతల తొలి చూలు పుత్రికా
మల్లికా ఆ....ఆ..ఆ..

చరణం 1:

యలమావులలో విరితావులలో...మనసున కోయిలలెగసే వేళ
వయసంతా వసంత గానమై ...జనియించిన యువ కావ్య కన్యక
మరులు గొలుపు మరుని బాణ దీపిక...
మల్లికా ఆ....ఆ..ఆ..

చరణం 2:

తొలి కోరికలే అభిసారికలై ...వలపుల కౌగిట బిగిసేవేళా
తొలి కోరికలే అభిసారికలై ...వలపుల కౌగిట బిగిసేవేళా
ఆ సొగసే అమృతాభిషేకమై ...
ఆ సొగసే అమృతాభిషేకమై....తనియించిన భువిలోన తారకా
మనసు తెలుపు తెలుపు నీదే మల్లిక...నా చంద్ర కైతిక
మల్లికా.. నవమల్లికా...మదనోత్సవ సంగీత సంచిక
మల్లికా.. ఆ..

0 comments:

Post a Comment