Pages

Subscribe:

Tuesday 26 August 2014

సన్నగా సన సన్నగా వినిపించే ఒక పిలుపు

     
చిత్రం: దీపారాధన (1980)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: దాసరి
నేపధ్య గానం: బాలు, సుశీల

ప: సన్నగా.. సన సన్నగా..వినిపించే ఒక పిలుపు
సన్నగా .. కను సన్నగా.. కనిపించే ఒక మెరుపు
ఆ పిలుపు మెరుపుదో.. ఆ మెరుపే పిలుపుదో

౧.  కోరికమ్మ గుడిలో కోయిలమ్మ కూసిందో
జాజులమ్మ తోటలో గాజులమ్మ పిలిచిందో
జాజులు జాజులు చేరి గుసగుసమన్నాయి.. ల.. ల.. ల.. ల
గాజులు గాజులు చేరి గలగలమన్నాయి
అన్నాయి అమ్మాయి నీ నడుమే సన్నాయి
విన్నాయి అబ్బాయి ఈ నీ మాటల సన్నాయి!!

౨.  చుక్కలమ్మ వాకిట్లో జాబిలమ్మ పూచిందో
మబ్బులమ్మ పందిట్లో ఉరుములమ్మ ఉరిమిందో
మబ్బు మబ్బు కలిసి మంచం వేశాయి.. ఆహాహా..
చుక్క చుక్క కలిసి పక్కలు వేశాయి
వేశాయి అబ్బాయి ప్రేమకు పీటలు వేశాయి
వేశాయి అమ్మాయి పెళ్ళికి బాటలు వేశాయి!!

0 comments:

Post a Comment