Pages

Subscribe:

Tuesday 26 August 2014

గోరువెచ్చని సూరీడమ్మా

     చిత్రం: జయసుధ
సాహిత్యం: దాసరి నారాయణరావు
సంగీతం: రమేష్ నాయుడు
గానం : సుశీల

గోరువెచ్చని సూరీడమ్మా
పొద్దుపొడుపులో వచ్చాడమ్మా
గోరువెచ్చని సూరీడమ్మా
పొద్దుపొడుపులో వచ్చాడమ్మా
వద్దన్నా రావద్దన్నా
గుండెల్లో గుడిసె వేసి అది గుడిగా చేసి
ఆ గుడిలో దాగున్నాడమ్మా
ఆ గుడిలో దాగున్నాడమ్మా
గోరువెచ్చని సూరీడమ్మా
పొద్దుపొడుపులో వచ్చాడమ్మా

౧. మిట్టమధ్యాహ్నం నడినెత్తిన వచ్చాడు
మిట్టమధ్యాహ్నం నడినెత్తిన వచ్చాడు
ఒంటరిగా పోతుంటే ఎంటెంట పడ్డాడు
ఇనకుండా పోతుంటే అరిసరిసీ పిలిచాడు
పిలిచి పిలిచి అలుపొచ్చి పైకెక్కానన్నాడు
ఎతికి ఎతికి అలకొచ్చి ఏడెక్కానన్నాడు
ఆ ఏడి దిగాలంటే నా తోడు కావాలంట
నే తోడు ఇస్తానంటే తను దిగి వస్తాడంటా!!

౨. పొద్దుగూకేయేల ఎదురుగా వచ్చాడు
పొద్దుగూకేయేల ఎదురుగా వచ్చాడు
ఎనుతిరిగీ పోతుంటే ఎనకెనక పిలిచాడు
పోనీ అని తిరిగితే ఎరుపెక్కి ఉన్నాడు
ఆగి ఆగి ఆగలేక దిగివచ్చానన్నాడు
చూసి చూసి మత్తెక్కి పిచ్చెత్తిందన్నాడు
ఆ పిచ్చి దిగాలంటే నా తోడు కావాలంట
నే తోడు ఇస్తానంటే పొమ్మన్నా పోడంట !!

0 comments:

Post a Comment