Pages

Subscribe:

Sunday 24 August 2014

చెలియలేదు చెలిమిలేదు

చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు (2)
ఉన్నదంతా చీకటైతే ఉందీ నీవేనే (2)
మిగిలిందీ నీవేనే...
చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు
చెలిమీ పోయే చెలువూ పోయే నెలవే వేరాయే
చెలిమీ పోయే చెలువూ పోయే నెలవే వేరాయే
చేరదీసి సేవచేసే తీరూ కరువాయే (2)
నీ దారే వేరాయే...
చెలిమీ పోయే చెలువూ పోయే నెలవే వేరాయే

చరణం : 1
మరపురానీ బాధకన్నా మధురమే లేదూ (2)
గతము తలచీ వగచేకన్నా సౌఖ్యమే లేదూ (2)
అందరానీ పొందుకన్నా అందమే లేదూ
ఆనందమే లేదు
చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు

చరణం : 2
వరదపాలౌ చెరువులైనా పొరలి పారేనే (2)
రగిలి పొగలు కొండలైనా పగిలి జారేనే (2)
దారిలేని బాధతో నేనారిపోయేనా
కథ తీరిపోయేనా
చెలిమీ పోయే చెలువూ పోయే నెలవే వేరాయే
ఉన్నదంతా చీకటైతే ఉందీ నీవేనే
మిగిలిందీ నీవేనే...

0 comments:

Post a Comment