Pages

Subscribe:

Wednesday 27 August 2014

తియ తీయని తేనెల మాటలతో - Teri pyaari surat ko kisiki nazar na lage

                

                
చిత్రం: ఖైదీ కన్నయ్య
రచన: జి.కృష్ణమూర్తి,
సంగీతం: రాజన్ నాగేంద్ర
గానం: పి. సుశీల, ఆర్‌.రాజశ్రీ

తీయ తీయని తేనెల మాటలతో
తీస్తారు సుమా గోతులు నమ్మవద్దూ
తెలియని చీకటి తొలగించీ
వెలుగిచ్చేది చదువే సూమా మానవద్దూ
దొంగల చేతికి దొరకనిదీ
దానము చేసిన తరగనిదీ
పదుగురిలోనా పరువును పెంచీ
పేరు తెచ్చే పెన్నిధదీ

పాఠాలన్నీ చదివేస్తాను
ఫస్టుగ నేను పాసౌతా
శభాష్‌................. ||తీయ తీయని||

అల్లరి చేయుట చెల్లనిదీ
ఎల్లప్పు డాడుట కూడనిదీ
ఏడువరాదు ఏమరరాదు
వీరుని వలెనే నిలవాలీ
బెదరను నేను అదరను నేను
ఏ దెదురైనా ఎదిరిస్తా
శభాష్‌............... ||తీయ తీయని||

బ్రతుకను బాటను కడదాకా
నడిచియె పోవలె ఒంటరిగా
యిడుములు రానీ పిడుగులు పడనీ
నీ అడుగులు తడబడునా
పిడుగులు పడినా జడవను నేను
వడి వడగానే అడుగేస్తా
శభాష్‌................. ||తీయ తీయని||


0 comments:

Post a Comment