Pages

Subscribe:

Monday 25 August 2014

ఏ రాగమో ఇది ఏ తాళమో

    
చిత్రం: అమరదీపం
రచన: ఆత్రేయ
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
గానం: ఎస్ పి బాలు, సుశీల
ప: ఏ రాగమో ఇది ఏ తాళమో (2)
అనురాగాని కనువైన
శ్రుతి కలిపినామో
ఏ రాగమో ఇది ఏ తాళమో (2)
మన కల్యాణ
శుభవేళ
మోగించు మేళమో
ఏ రాగమో
ఇది ఏ తాళమో


౧. ఎదలో మెదిలే సంగతులన్నీ
పలికెను సంగీతమై
పలికెను సంగీతమై...
కలిసిన కన్నుల మెరిసే కళలే
వెలిసెను గమకములై
వెలిసెను గమకములై...
హొయలైన నడకలే లయలైనవి
చతురాడు నవ్వులే గతులైనవి
సరి సరి అనగానే
మరి మరి కొసరాడు
మురిపాలె మన
జంట స్వరమైనది॥రాగమో॥

౨. విరికన్నె తనకు
పరువమే కాదు
పరువూ కలదన్నది
పరువూ కలదన్నది...
భ్రమరము తనకు
అనుభవమే కాదు
అనుబంధముందన్నది
అనుబంధముందన్నది...
కోకిలమ్మ గుండెకు గొంతున్నది
కొమ్మలో దానికి గూడున్నది
సరి మగవానికి సగమని తలపోయు
మన జంటకే జంట సరి ఉన్నది॥రాగమో॥

0 comments:

Post a Comment