Pages

Subscribe:

Monday 12 June 2017

వటపత్ర సాయికి వరహాల లాలి


చిత్రం : స్వాతిముత్యం (1986)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : సినారాయణ రెడ్డి గారు
నేపధ్య గానం : సుశీల

పల్లవి : లాలి లాలి లాలి లాలి...
లాలి లాలి లాలి లాలి...
వటపత్ర సాయికి... వరహాల లాలి
రాజీవ నేత్రునికి... రతనాల లాలి
వటపత్ర సాయికి... వరహాల లాలి
రాజీవ నేత్రునికి... రతనాల లాలి
మురిపాల కృష్ణునికి.. ఆ... ఆ... ఆ...
మురిపాల కృష్ణునికి... ముత్యాల లాలి
జగమేలు స్వామికి.... పగడాల లాలి...
వటపత్ర సాయికి... వరహాల లాలి
రాజీవ నేత్రునికి.... రతనాల లాలి
లాలి లాలి లాలి లాలి...
లాలి లాలి లాలి లాలి...
చరణం 1 :కళ్యాణ రామునికి... కౌశల్య లాలి
కళ్యాణ రామునికి... కౌశల్య లాలి
యదువంశ విభునికి... యశోద లాలి
యదువంశ విభునికి.... యశోద లాలి
కరిరాజ ముఖునికి...
కరిరాజ ముఖునికి... గిరితనయ లాలి
కరిరాజ ముఖునికి... గిరితనయ లాలి
పరమాంశ భవునికి... పరమాత్మ లాలి!!
చరణం 2 : అలమేలు పతికి... అన్నమయ్య లాలి
అలమేలు పతికి... అన్నమయ్య లాలి
కోదండ రామునికి... గోపయ్య లాలి
కోదండ రామునికి... గోపయ్య లాలి
శ్యామలాంగునికి... శ్యామయ్య లాలి
శ్యామలాంగునికి... శ్యామయ్య లాలి
ఆగమనుతునికి... త్యాగయ్య లాలి!!






                                   

0 comments:

Post a Comment