Pages

Subscribe:

Monday 12 June 2017

ఏ దేశమేగినా... ఎందుకాలిడినా...


చిత్రం: అమెరికా అబ్బాయి
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: సుశీల
పల్లవి: ఏ దేశమేగినా... ఎందుకాలిడినా...
ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవమూ...
రాయప్రోలన్నాడు ఆనాడూ... అది మరిచిపోవద్దు ఏనాడూ
చరణం 1: పుట్టింది నీ మట్టిలో సీత.... రూపు కట్టింది దివ్య భగవద్గీత
వేదాల వెలసినా ధరణిరా...వేదాల వెలసినా ధరణిరా...
ఓంకార నాదాలు పలికినా అవనిరా
ఎన్నెన్నొ దేశాలు కన్ను తెరవని నాడు
వికసించె మననేల విజ్ఞాన కిరణాలు!!
చరణం 2: వెన్నెలదీ ఏ మతమురా...?
కోకిలదీ ఏ కులమురా...?
గాలికి ఏ భాష ఉందిరా...?
నీటికి ఏ ప్రాంతముందిరా...?
గాలికీ నీటికీ లేవు భేధాలూ...
మనుషుల్లో ఎందుకీ తగాదాలు కులమత విభేదాలు!!
చరణం3: గౌతమ బుధ్ధుని బోధలు మరవద్దూ..
గాంధీ చూపిన మార్గం విడవద్దూ....
గౌతమ బుధ్ధుని బోధలు మరవద్దూ
గాంధీ చూపిన మార్గం విడవద్దూ....
ద్వేషాల చీకట్లూ తొలగించూ..
స్నేహ దీపాలు ఇంటింటా వెలిగించూ
ఐకమత్యమే జాతికి శ్రీరామ రక్షా
అందుకే నిరంతరం సాగాలి దీక్షా...
అందుకే నిరంతరం సాగాలి దీక్షా...!!

0 comments:

Post a Comment