Pages

Subscribe:

Monday 12 June 2017

అద్దంలాంటి చెక్కిలి చూసి ముద్దొస్తుందంటావా


చిత్రం: నిండు హృదయాలు 
సంగీతం: టి.వి.రాజు 
రచన: సి నా రె 
గానం: ఘంటసాల, పి సుశీల 
పల్లవి: అద్దంలాంటి చెక్కిలి చూసి ముద్దొస్తుందంటావా
చెంపకు చేరెడు కళ్ళను చూసి చెంతకొస్తానంటావా
అమ్మమ్మో ఓయమ్మో అమ్మమ్మో సోగ్గాడా
వచ్చావా మావాడ
కాలిలో మువ్వలుఘల్లంటున్నాయి
మోవిలో నవ్వులు ఝిల్లంటున్నాయి
కాలిలో మువ్వలుఘల్లంటున్నాయి
మోవిలో నవ్వులు ఝిల్లంటున్నాయి
మెత్తగా....మెత్తగా సోకిందంటే నీ చేయిమత్తుగా చిత్తైపోవును ఈ రేయి
ఎంతటి రసికుడవో ఇపుడే...ఇపుడే తెలిసిందీ
మధుపాత్రకు ఏనాడో మాసంగతి తెలిసింది
అద్దంలాంటి చెక్కిలి చూసి అల్లాడిపోయాను
చెంపకు చారెడు కళ్ళను చూసి చిత్తైపోతున్నాను
అమ్మమ్మో ఓయమ్మో అమ్మమ్మో నీతోడు ఓయమ్మో ఇటు చూడు
చూపులో మైకం ఇంకా రావాలి కైపులో పాకం ఇంకా కావాలి                                                                చూపులో మైకం ఇంకా రావాలి కైపులో పాకం ఇంకా కావాలి
గుండెలో...గుండెలో గుసగుసలేవో నిండాలి
దండలో ఘుమఘుమలెన్నో పండాలి
ఇంతకు మించిన తరుణం ఇంకేన్నడు రాదు
మనసుంటే అనుకుంటే మళ్ళీ రాకపోదు!!




0 comments:

Post a Comment