Pages

Subscribe:

Monday 12 June 2017

అభినందన మందారమాల..


చిత్రం: తాండ్ర పాపారాయుడు (1986)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: ఏసుదాస్, సుశీల
పల్లవి: అభినందన మందార మాల..
అభినందన మందార మాల..
అభినందన మందార మాల.. అభినాయక స్వాగత వేళ..ఆ..
అభినందన మందార మాల..
స్త్రీజాతికీ.. ఏనాటికీ.. మననీయ మహనీయ వీరాగ్రణికి..
అభినందన మందారమాల.. అభినాయక స్వాగత వేళ..ఆ..
చరణం 1: వేయి వేణువులు నిన్నే పిలువగ.. నీ పిలుపు నావైపు పయనించెనా!!2సార్లు!!
వెన్నెల కన్నెలు నిన్నే చూడగా..!!2సార్లు!!
నీ చూపు నారూపు వరియించెనా!!2సార్లు!!
నా గుండె పై నీవుండగా.. విరితానే భువిపైనే దిగివచ్చెనా
అభినందన మందారమాల.. అలివేణి స్వాగత వేళ..ఆ..
అభినందన మందారమాల..
సౌందర్యం సౌశీల్యం.. నిలువెల్ల నెలకొన్న కలభాషిణికి అభినందన మందారమాల !!
చరణం 2: వెండి కొండపై వెలసిన దేవర.. నెలవంక మెరిసింది నీ కరుణలో!!2సార్లు!!
సగం మేనిలో ఒదిగిన దేవత..!!2సార్లు!!
నునుసిగ్గు తొణికింది నీ తనువులో!!2సార్లు!!
ప్రియ భావమే లయ రూపమై.. అలలెత్తి ఆడింది అణువణువులో
అభినందన మందారమాల.. ఉభయాత్మల సంగమమేళ..ఆ..

అభినందన మందారమాల..

0 comments:

Post a Comment