Pages

Subscribe:

Monday 12 June 2017

అభినవ తారవో .. నా అభిమాన తారవో..




చిత్రం : శివరంజని (1978)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : బాలు
పల్లవి :అభినవ తారవో .. నా అభిమాన తారవో..
అభినవ తారవో..
అభినయన రసమయ కాంతిధారవో
అభినయ రసమయ కాంతిధారవో
మంజుల మధుకర సింజాల సుమశర శింజిని శివరంజనీ ... శివరంజనీ
చరణం 1 :అది దరహాసమా .. మరి మధుమాసమా
అది దరహాసమా .. మరి మధుమాసమా
ఆ మరునికి దొరికిన అవకాశమా
అవి చరణమ్ములా ? శశికిరణమ్ములా ?
అవి చరణమ్ములా ? శశికిరణమ్ములా ?
నా తరుణ భావనా హరిణమ్ములా!!
చరణం 2 :ఆ నయనాలు విరిసిన చాలు.. అమవస నిశిలో చంద్రోదయాలు
ఆ నయనాలు విరిసిన చాలు.. అమావస నిశిలో చంద్రోదయాలు
ఆ నెన్నడుము ఆడిన చాలు ...
ఆ నెన్నడుము ఆడిన చాలు.. రవళించును పదకవితా ప్రభందాలు
చరణం 3 :నీ శృంగార లలిత భంగిమలో.. పొంగిపోదురే ఋషులైనా
నీ కరుణరసావిష్కరణంలో కరిగిపోదురే కర్కశులైనా
వీరమా ... నీ కుపిత నేత్ర సంచారమే
హాస్యమా .... నీకది చిటికలోన వశ్యమే
నవరస పోషణ చణవనీ
నటనాంకిత జీవనివనీ
నిన్ను కొలిచి వున్నవాడ.. మిన్నులందుకున్నవాడ
నీ ఆరాధకుడను.. ఆస్వాదకుడను.. అనురక్తడనూ..
నీ ప్రియభక్తుడనూ!!

0 comments:

Post a Comment