Pages

Subscribe:

Monday 12 June 2017

ఆ నవ్వుల కోసమే..నేను కలలు కన్నాను


చిత్రం: జమిందారు (1966)
సంగీతం: టి. చలపతిరావు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల
పల్లవి: ఆ నవ్వుల కోసమే..నేను కలలు కన్నాను..
ఆ నడకల కోసమే...నేను కాచుకున్నాను...
ఆ నవ్వుల కోసమే..నేను కలలు కన్నాను..
ఆ నడకల కోసమే...నేను కాచుకున్నాను..
చరణం 1: ఈ నవ్వులు ఎవ్వరివి ...నీవే చిలికించినవీ
ఈ నడకలు ఎవ్వరివి.. నీవే నడిపించినవి..
నీ జీవన రాగాలే నాలో వినిపించినవీ..
నీ జీవన రాగాలే నాలో వినిపించినవీ...హో...
నాలో వినిపించినవి!!ఆ నవ్వుల!!
చరణం 2: అల్లుకున్న ఆశలన్నీ..పల్లవించె ఈనాడే...
మరులుగొన్న బాసలన్నీ...పరిమళించె ఈ వేళా...
చేరలేని నీలాకాశం ..శిరసు వంచె మనకోసం...
చేరలేని నీలాకాశం...శిరసు వంచె మనకోసం....హో...
శిరసు వంచె మన కోసం!!ఆ నవ్వుల!!
చరణం 3: ముందు నీవు నిలుచుంటే నందనాలు కావాలా..
మనసులోన నీవుంటే...మందిరాలు నాకేలా...
కడలిలోని తరగలవోలే కలిసిపోదమీ వేళా...
కడలిలోని తరగలవోలే కలిసిపోదమీ వేళా...హో...
కలిసిపోదమీ వేళా!!ఆ నవ్వుల!!

0 comments:

Post a Comment