Pages

Subscribe:

Thursday 5 September 2013

నర్తనశాల - ఎవరికోసం ఈ మందహాసం

                      
రచన: శ్రీశ్రీ
గానం: ఘంటసాల, పి.సుశీల
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి

ప. ఎవ్వరికోసం ఈ మందహాసం ఒకపరి వివరింపవే
సొగసరి ఒకపరి వివరింపవే
చెలిమికోసం చెలిమందహాసం ఏమని వివరింతునొ
గడుసరి ఏమని వివరింతునో

౧. వలపులు చిలికే వగలాడి చూపు
పిలువక పిలిచి విరహాల రేపు
యెదలో మెదలే చెలికానిరూపు
ఏదో తెలియని భావాల రేపు
ఈ నయగారం ప్రేమ సరాగం
అందించు అందరాని సంబరాలే !!ఎవ్వరి!!

౨. పరుగులు తీసె జవరాలి వయసు
మెరుపై మెరిసి మరపించు మనసు
ప్రణయం చిందే సరసాల బంధం
ఇరువురి నొకటిగ పెనవేయు బంధం
ఈ వయ్యారం ఈ సింగారం
ఈ వయ్యారం ఈ సింగారం
చిందించుచిన్ని చిన్ని వన్నెలెన్నో!!ఎవ్వరి!!

0 comments:

Post a Comment