Pages

Subscribe:

Saturday 28 September 2013

చక్కెర కలిపిన తీయని

                                     
చక్కెర కలిపిన తియ్యని కమ్మని తోడు పెరుగు తెలుగు
చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల బెడగు
నన్నయ తిక్కన ఎఱ్ఱన పితికిన ఆవు పాల పొదుగు
చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టినిల్లు తెలుగు

1. హిమగిరి జలనిధి పదముల అమరిన జిలుగు వెలుగు తెలుగు
గణయతిప్రాసల రసధ్వనిశాఖల కవితలల్లు పులుగు
నవ నవ పదముల కవితా రధముల సాగిపోవు నెలవు
అలవోకగ అష్టావధానములు సేయు కవుల కొలువు

2. అల్లసాని అల్లికల జిగిబిగిని అమృతధార తెలుగు
శ్రీనాధుని కవితా సుధారలో అమర గంగ పరుగు
రాయల కల్పనలో రామకృష్ణుని శిల్పములో
రసధారయై ధృవతారయై మనదేశ భాషలను లెస్సయై
దేవభాషతో చెలిమిచేసి పలు దేశదేశముల వాసికెక్కినది

3. మన అక్షరాల తీరు మల్లెపాదు కుదురు
మన భాష పాలకడలి - భావం మధుమురళి
అజంత పదముల అలంకృతం మనభాష అమృత జనితం
భారత భాష భారతి నుదుట తెలుగు భాష తిలకం

0 comments:

Post a Comment