Pages

Subscribe:

Saturday 28 September 2013

అమ్మదొ౦గా నిన్ను చూడకు౦టే

                             
రచన: పాలగుమ్మి విశ్వనాథ్
సంగీతం : పాలగుమ్మి విశ్వనాథ్
గానం : వేదవతీ ప్రభాకర్ గారు

అమ్మ దొంగా నిన్ను చూడకుంటే.. నాకు బెంగా.. ||2||
 కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలడుగుతూ ఊ..ఊ..ఉ..
 నా కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలడుగుతూ
 కల కలమని నవ్వుతూ కాలం గడిపే నిన్ను... చూడకుంటే.. నాకు బెంగా...
 ||అమ్మ దొంగా||
కధ చెప్పే దాకా కంట నిదుర రాకా...
 కధ చెప్పే దాకా నీవు నిదుర బోకా...
 కధ చెప్పే దాకా నన్ను కదలనీక....
 మాట తోచనీక...మూతి ముడిచి చూసేవు...
 ||అమ్మ దొంగా||
ఎపుడో ఒక అయ్య నిన్నెగరేసుకు పోతె...
 నిలువలేక నా మనసు నీ వైపే లాగితే...
 ఎపుడో ఒక అయ్య నిన్నెగరేసుకు పోతె...
 నిలువలేక నా మనసు నీ వైపే లాగితే...
 గువ్వ ఎగిరి పోయినా గూడు నిదుర పోవునా...||2||
 ||అమ్మ దొంగా||
నవ్వితే నీ కళ్ళు ముత్యాలు రాలు...
 ఆ నవ్వే నిను వీడక ఉంటే అది చాలు...
 నవ్వితే నీ కళ్ళు ముత్యాలు రాలు...
 ఆ నవ్వే నిను వీడక ఉంటే పది వేలు..
 కలతలూ కష్టాలు నీ దరికి రాకా
 కలకాలము నీ బ్రతుకు కలల దారి నడవాలి
 కలతలూ కష్టాలు నీ దరికీ రాకా
 కలకాలము నీ బ్రతుకు కలల దారి నడవాలి...
 ||అమ్మ దొంగా||




















1 comments:

VRao Talluri said...

మంచి videos ని ఒక చొటకు చేర్చే మీప్రయత్నం శ్లాగనీయం.
ఈపాట పాడింది-H హేమావతి గారు. వేదవతి ప్రభాకర్ గారు కాదు.
వేదవతి ప్రభాకర్ గారి ' అమ్మదొంగా ' ఇక్కడ వినండి.
http://cooltoad1.com/music/song/b61ba9ee23c297fde3d775a4d8075c74

టి వి రావు

Post a Comment