Pages

Subscribe:

Wednesday 3 August 2016

5. ధైర్యలక్ష్మి:

పూజ్య గురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు అష్టలక్ష్ములపై శ్లోకములు, పాటలు వ్రాసారు. ఇవి ఆయా లక్ష్ములకు సంబంధించిన శాస్త్రవైభవములతో శ్రీ సూక్తము మొదలైనవాటితో మంత్రగర్భితంగా కూర్చబడినవి. ఈ శ్రావణ మాసంలో నిత్య పారాయణం చేసుకోదగినవి.
శ్లోకము: శ్రీం బీజాక్షర రూపిణీం నత మనో దారుఢ్య సంధాయినీమ్
హృత్పీఠాధి నివాసినీం జడ తమఃసంహారిణీం ఈశ్వరీమ్
సామర్థ్యాదిక దాయినీం సకలసంతోషప్రదాం భాస్వరామ్
ధైర్య స్థైర్య గుణప్రదాం శివకరీం లక్ష్మీం సదా భావయే

పల్లవి: ధైర్యలక్ష్మీం సర్వకార్యఫలదాయినీం ఆర్యజన సన్నుతాం అంబికాం భావయే

చరణం: శ్రీపీఠసింహాసినీం మహా రాజ్ఞీమ్
ఆపన్నివారిణీం ఆతంకహారిణీమ్
సంపత్స్వరూపిణీం సామ్రాజ్యదాయినీమ్
వ్యాపినీం లోకైక దీపాంకురాం భజే ... పల్లవి....

చరణం: సకల సంకల్ప ఫల సాన్నిధ్య కారిణీమ్
అకళంకశశిముఖీం అనుగ్రహ విగ్రహామ్
వికృత భావాంతకాం విస్తృత జగన్మయీమ్
సుకృతజన గోచరాం శుద్ధాం సదా భజే

http://picosong.com/c46T

2 comments:

GKK said...

The Lakshmi devi keertanas being posted by you are worth their weight in gold. You did a good job. The lyrics are flawless. Thank you.

అరుణ రేఖ కూచిభొట్ల said...

Thankyou sir

Post a Comment