Pages

Subscribe:

Sunday 28 August 2016

ఎంతటి సులభ ప్రసన్నుడు ఇతడెంతటి చల్లని దేవుడు

శ్రీ గణేశాయ నమః
బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు గణేశుని పై వ్రాసిన బహు కీర్తనలలో ఒకటి....

పల్లవి:
ఎంతటి సులభ ప్రసన్నుడు ఇతడెంతటి చల్లని దేవుడు
గోరంతగ భక్తిని చూపగ కొండంతగ ఏలే నాథుడు గణనాథుడు...మననాథుడు
చరణం:
గరికలతో పూజించిన చాలును గరిమగబ్రోచె కరిముఖుడు
పచ్చివడపప్పు ఇచ్చిమ్రొక్కితే మెచ్చి కరుణించు మేలిమి దేవుడు
గున గున నడకల కైలాసమ్మున కనుల పండువుగ తిరుగాడి
అమ్మ పార్వతికి అయ్య శంభునకు ఆనందమ్మిడు లీలామయుడు
చరణం:
ఇరువది ఒక పత్రాలనిచ్చిన మరి మరి మురిసె మా విభుడు
వంగి వంగి గుంజీలు తీసిన తప్పులు క్షమించు ఒప్పుల రాయడు
తలచిన వెంటనె నిలుచును ముందర తొలగించును పెను విఘ్నముల
అనుగు సోదరడు ఆ స్కందునితో అటలాడుకొను ఆనందదడు
చరణం:
కొబ్బరి చెరుకులు కోరి ఒసంగిన అబ్బురమగునటులుబ్బునట
కుడుములుండ్రాళ్ళు నివేదనమ్మిడ ఇడుములబాపే ఏలిక ఇతడట
గణేశ గణేశ యనగా గణించి స్ఫురించి తరింపజేయును
చవితి పూజలకు తనిసి వరమ్మిడు భువనాధ్యక్షుడు శివమయుడు

 http://picosong.com/cpcs

0 comments:

Post a Comment