Pages

Subscribe:

Sunday 28 August 2016

తొలి తొలి పూజల దేవర

శ్రీ గణేశాయ నమః
బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు గణేశుని పై వ్రాసిన బహు కీర్తనలలో ఒకటి....
తొలి తొలి పూజల దేవర! కొలుతుము నిన్ను గణేశ్వరా!
చేట చెవుల దొరా! నా విన్నపమును చెవిని పెట్టవయ్యా
మాటికి మాటికి మొరపెట్టే నా మనవిని చేకొనుమయ్యా
చరణం:
అంబాతనయా! లంబోదర! ఆలంబనమీయుమయా
మోదకహస్తా! మోహనగర! సమ్మోదమునొందుమయా
వెనుకకు లాగుచు వెలితిని జూపే వెతలను బాపుమయా
పెనగొని తగిలే విఘ్నపుంజముల పెకలించుమా సదయా!
చరనం:
హాస్య రసేశ! గజాస్య! గణేశ! సులాస్య కళానిలయా!
మూషికవాహన! దోషహర! సంతోషభావహృదయా!
అటమటపెట్టెడి కుటిలపు తలపుల చటుకున కూల్చుమయా
నిటలనయనసుత! అటునిటు చెదరక స్ఫుటముగ గొలుతుమయా

http://picosong.com/cMGF

0 comments:

Post a Comment