Pages

Subscribe:

Sunday 28 August 2016

నటియించినాడే నర్తన గణేశుడు

శ్రీ గణేశాయ నమః
బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు గణేశుని పై వ్రాసిన బహు కీర్తనలలో నర్తనగణపతిపై అద్భుత కీర్తన .
నటియించినాడే నర్తన గణేశుడు నటియించినాడే
చిటిపదంబులు కదల చటులగతులిటుకుదర
అటునిటు చెలంగుచూ అద్భుత విలాసముల
నటియించినాడే....................
మిసిమి పసిరూపుతో మసలునొకసారి
అంతట మహాకాయమగునొక్కసారి
అణువుకన్నా అణువు మహత్తుకి మహత్తూ
గగనములు భువనములు కదలించు గణమూర్తి
......నటియించినాడే నర్తన గణేశుడు నటియించినాడే....
ఘలు ఘల్లు ఘల్లుమని కాలి గజ్జెలు మ్రోగ
పలుముద్రలను చూపి చెలగి చేతులు త్రిప్పి
ఊగిసల ఘీంకారమొనరించు తొండమున
శూర్పకర్ణములాడ శూలిపుత్రుడు శుభుడు
......నటియించినాడే నర్తన గణేశుడు నటియించినాడే....
ఒకపాదమెత్తి మరి ఒక పదము భువినుంచి
పాముజందెమ్మాడ ఏకదంతము మెరయ
తలపైన నెలవంక తబ్బిబ్బుగానాడ
సకల కళలకు తానె సాకరమై నిలచి
......నటియించినాడే నర్తన గణేశుడు నటియించినాడే....


 http://picosong.com/cWVe/

0 comments:

Post a Comment