Pages

Subscribe:

Sunday 28 August 2016

తులసీ దళములతో పూజింతును సురభిల సుమముల అర్చన చేతును

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు శ్రీ వేంకటేశ్వరుని పై వ్రాసిన అర్చనాపూర్వక (అంగపూజ) కీర్తన... "శ్రీ వేంకటనాథా!" ఆల్బం నుండి...
పల్లవి: తులసీ దళములతో పూజింతును సురభిల సుమముల అర్చన చేతును;
అడుగుల మొదలుగ ఆ సిగవరకు అయ్యా! నిన్నే ఆరాధింతును
చరణములు :
(1) గంగ జనించిన ఘనమౌ పదముల అర్పించితిని అలరుల గుత్తులు
జానువులకు ఊరువులకు మ్రొక్కుచు అందించెద నీ సుందర దళముల
కమళనాభ! నీ కటిసీమమునకు సమర్పించితిని సరళ సుమమ్ములు
కటిహస్తమునకు వరద కరమునకు పూజలొనర్తుము పూచిన తలపుల
పల్లవి: తులసీ దళములతో పూజింతును సురభిల సుమముల అర్చన చేతును;
అడుగుల మొదలుగ ఆ సిగవరకు అయ్యా! నిన్నే ఆరాధింతును
(2) సిరులతల్లి నెలవైన వక్షమున అలంకారములు స్వర్ణమాలికలు
శంఖ చక్రములు సవరించిన నీ చేతులకివిగో చెలువపు పువ్వులు
సకలసౌందర్య సారమౌచు సరిసాటిలేని వదనమునకు పూజలు
వజ్రాదులచే ఖచితమైన నీ స్వర్ణ మకుటమ్మునకు అర్చనలు
పల్లవి: తులసీ దళములతో పూజింతును సురభిల సుమముల అర్చన చేతును;
అడుగుల మొదలుగ ఆ సిగవరకు అయ్యా! నిన్నే ఆరాధింతును

 http://picosong.com/4rwJ

0 comments:

Post a Comment