Pages

Subscribe:

Sunday 28 August 2016

సవిత్రాత్మకా! రుద్రా! సావిత్రీ తేజమా!

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు వ్రాసిన శివపదములోనుండి సూర్యుని పై కీర్తన:
పల్లవి: సవిత్రాత్మకా! రుద్రా! సావిత్రీ తేజమా!
భవాంధపటలాపహా! భానుమండలాంతరా!
చరణం: అగ్నివాయు సూర్యాత్మక అఖిల విశ్వరూపా!
సప్తఛందాశ్వరథిక! సకల శ్రుత్యాకారా!
నీప్రభారశ్ములే నిండినవీ విశ్వమంత
జీవులప్రేరేపించెడి చిత్తేశా! బుద్ధిశాస్త! ..... పల్లవి....
చరణం: అచ్ఛేద్యా! ఆదిత్యా! అంతరిక్షకారకా!
శక్తిసంయుతా! రుద్రా! షణ్ముఖావనా! శంభూ!
హృదంతరమె రవిమండలమంతర్గత భాస్కరుడవు
నీకరుణకు నీ వింటికి వేల వేల నమస్సులు .... పల్లవి....

(సూర్యరూపుడైన రుద్రుడు తన కిరణాల బాణాలను ప్రయోగిస్తున్నాడని రుద్రనమకం చెప్తోంది)

0 comments:

Post a Comment