Pages

Subscribe:

Sunday 28 August 2016

విన్నవించుమమ్మా! నీ విభునితో

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు శ్రీ వేంకటేశ్వరుని పై వ్రాసిన కీర్తనలలో అమ్మవారిని వేడుకుంటున్న కీర్తన... "శ్రీ వేంకటనాథా!" ఆల్బం నుండి...
పల్లవి: విన్నవించుమమ్మా! నీ విభునితో పన్నగశయనునితో ఆపన్న శరణ్యునితో;
అలమేలు మంగా! మా కలతలన్ని తీరంగా చెలువపు నీ పతి చెంగట చేరి బ్రోవుమనుచూ

చరణములు:
(1) మా కన్నా ముందర ఆ కొండకొమ్ము చేరి
నీ కాంతుని వక్షమ్మున నీ చోటనె నిలిచి
ఏకాంతపు వేళలో వేడుక సయ్యాటలో
చీకాకుల మా బ్రతుకుల చిక్కు తీసి కాపాడగ
పల్లవి: విన్నవించుమమ్మా! నీ విభునితో పన్నగశయనునితో ఆపన్న శరణ్యునితో;
అలమేలు మంగా! మా కలతలన్ని తీరంగా చెలువపు నీ పతి చెంగట చేరి బ్రోవుమనుచూ
(2) అయ్య శ్రీనివాసుడు ఇతడనుచు మాకు చూపించి
నెయ్యపు మా సామి కరుణ నీ రూపని తెలిపి
వేయివిధాలుగ హరినే వినుతులతో కొలిచి నీవు
చేయివేసి మా బ్రతుకులు చేదుకొనగ ఆదుకొనగ
పల్లవి: విన్నవించుమమ్మా! నీ విభునితో పన్నగశయనునితో ఆపన్న శరణ్యునితో;
అలమేలు మంగా! మా కలతలన్ని తీరంగా చెలువపు నీ పతి చెంగట చేరి బ్రోవుమనుచూ

 http://picosong.com/59c2

0 comments:

Post a Comment