Pages

Subscribe:

Friday 21 February 2014

ముజ్జగమ్ములనేలు ముగ్గురమ్మల శక్తి

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు వ్రాసిన `శ్రీమాతా లలితా' ఆల్బంలో శ్రీమతి నిత్యశ్రీ గరు పాడిన పాట:
పల్లవి: ముజ్జగమ్ములనేలు ముగ్గురమ్మల శక్తి
రాశిపోసిన మహారాణివే నీవు..
సర్వ చైతన్య సాకారముర్తీ
శరణు శరణోయమ్మా కరుణాకటాక్షీ

(1) ఓంకారనాదమునకాకారమేనీవు
వేదాదివిద్యలకు ఆధారమైనావు,
శృతిలయల గతులలో శుద్ధసంగీతమై
వాగర్ధముల మూలమైవెలసినావు ................. (ప.)
(2) జగములనుపోషించు సంపదల దేవతవు
అష్టసిద్ధులతోడ అందగించే కళవు,
కడకంటి చూపులో కనకధారలు కురిసే
లేమి అనుమాటనే లేకుండజేసెదవు.
(3) లోకైకదీపాంకురానివే నీవు
దుర్గతుల దునుమాడు దుర్గవైనావు,
చిన్మయాననమందు చిగురించు జ్యోతివై
శివుని పట్టపురాణిగావెలిగినావు

0 comments:

Post a Comment