Pages

Subscribe:

Friday 21 February 2014

భజామి భారత మాతరమ్

భజామి భారత మాతరమ్ - సంశ్రయామి భారత మాతరమ్
భవామి భారత సేవకోహమ్ - నమామి భారత మాతరమ్

౧. ఋషివరదర్శిత ధర్మపథానుగ చరితాం చిద్రసకలితాం లలితాం
క్షేత్రతీర్థసత్తపో ధారుణీం యజ్ఞధారిణీం జగత్తారిణీమ్...భజామి!!

౨. శౌర్య ధైర్య వీరప్రతాప నవశక్తిమయీం త్వాం ఉజ్జ్వలాకృతిం
శాంతదయా సౌజన్యమానసాం క్షమాస్నేహమయ ప్రసన్నద్యుతీమ్...భజామి!!

౩. శ్రుతి స్మృతి పురాణాగమ జననీం శాస్త్రమయీం విద్యాధిష్ఠాత్రీం
పరాపరజ్ఞానోల్లసితాం తాం విశ్వగురురూపిణీం విశారదామ్......భజామి!!

భారతమాతను భజిస్తున్నాను - సమగ్రంగా ఆశ్రయిస్తున్నాను
భారతమాతకు సేవకుడనౌతున్న నేను ఆ తల్లిని నమస్కరిస్తున్నాను
శ్రేష్ఠులైన ఋషులు దర్శించిన ధర్మ మార్గాన్ని అనుసరించే చరిత కలిగి, చైతన్య రసమయమైన లావణ్యంతో,
క్షేత్ర తీర్థ తపోవనాది స్థానాలతో శోభిల్లే భూమిని, యజ్ఞమును ధరించి జగతిని తరింపజేసే భారతమాతను భజిస్తున్నాను.
శౌర్యధైర్య వీరప్రతాపాదులతో నిత్యనూతన శక్తిగా ప్రకాశించే ఆకృతిగల తల్లిని, శాంతం
దయ సౌజన్యం వంటి సౌమ్య గుణాలి కల మనస్సుతో సహన, స్నేహభావాలతో కూడిన ప్రసన్న వర్చస్సు గల
భారతమాతను ఆశ్రయిస్తున్నాను.
వేద ధర్మ శాస్త్ర పురాణ మంత్ర శాస్త్రాదులకు కారణమైన తల్లి, విజ్ఞాన శాస్త్రాలతో కూడి, విద్యలకు అధిష్ఠానదేవతయై, లౌకిక పారమార్థిక జ్ఞానాలతో భాసిస్తూ, విశ్వానికే గురురూపంగా ఉండే విద్వాంసురాలైన భారతమాతను ఆశ్రయిస్తున్నాను.
(భారతమాత అసలు స్వరూపమిది. ఇది ఆర్షభూమి. వీర భూమి. శాంత సామరస్య భూమి. జ్ఞాన భూమి)

0 comments:

Post a Comment