Pages

Subscribe:

Saturday 22 February 2014

ఓ సర్వలోకేశ ఓ దేవదేవ దీవింపవే మమ్ము దీనమందార

                       
చిత్రం: పెద్దమనుషులు (రాష్ట్రపతి పురస్కారం పొందిన మొట్టమొదటి తెలుగు చిత్రం)
సంగీతం: ఓగిరాల రామచంద్రరావు
గానం: పి. లీల బృందం




ఓ సర్వలోకేశ ఓ దేవదేవ దీవింపవే మమ్ము దీనమందార
సర్వలోకేశ ఓ దేవదేవ దీవింపవే మమ్ము దీనమందార

౧. ఏ పాపమెరుగని పసిపాపలమురా
మన్నించి ముందుండి మమ్ము నడిపించు
పాపమెరుగని పసిపాపలమురా
మన్నించి ముందుండి మమ్ము నడిపించు

౨. సంకుచిత భావాలు సమసిపోవంగ
స్వాతంత్ర్య విజ్ఞాన జ్యోతి వెలగాలి
అధర్మమమునైన ఎదిరించి నిలిచి -
నిర్భయముగ మేము నిజమె పలకాలి

౩. పేదలు ధనికులు భేదాలు మాని
చెలిమియే బలమంచు కలిసి బ్రతకాలి
కష్టమొచ్చినా ఎవరడ్డుపడినా
దీక్షతో ధర్మమే ఆచరించాలి


0 comments:

Post a Comment