Pages

Subscribe:

Friday 21 February 2014

తేనెకన్నా తీయనిదీ తెలుగుభాష

                        
చిత్రం: రాజ్ కుమార్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఎస్ పి బాలు, పి సుశీల
సంగీతం: ఇళయరాజా

దినదినము వర్ధిల్లు తెలుగుదేశం
దీప్తులను వెదజల్లు తెలుగు తేజం


తేనెకన్నా తీయనిది తెలుగు భాష
తేనెకన్నా తీయనిది తెలుగు భాష
దేశభాషలందు లెస్స్ తెలుగు భాష!!తేనెకన్నా!!

౧. భామల్లారా తుమ్మెదా
భామలమ్మల్లారా తుమ్మెదా
హంసల్లు, చిలకల్లు తుమ్మెద
ఆకాశమందు తిరుగు తుమ్మెదా
కొంగల్లు, పిచుకల్లు తుమ్మెదా
గుడిచుట్టూ తిరిగాయి తుమ్మెదా
కొలనులో తామరలు తుమ్మెదా
కోరి వికసించాయి తుమ్మెదా

మయూరాల వయారాలు మాటలలో పురివిప్పును
పావురాల కువకువలు పలుకులందు నినదించును
సప్తస్వర నాద సుధలు నవరసభావాల మణులు
జానుతెనుగు సొగసులోన జాలువారు జాతి!!తేనెకన్నా!!

౨. అమరావతి సీమలో కమనీయ శిలామంజరి
రామప్ప గుడిగోడల రమణీయ కళారంజని
అన్నమయ్య సంకీర్తనం, క్షేత్రయ్య శృంగారం
త్యాగరాజు రాగమధువు తెల్గు సామగానమయం!!తేనెకన్నా!!

0 comments:

Post a Comment