Pages

Subscribe:

Friday 21 February 2014

అష్టాదశ పీఠవాసినీ

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు వ్రాసిన `శ్రీమాతా లలితా' ఆల్బంలో శ్రీమతి శైలజ గారు పాడిన పాట:

పల్లవి: అష్టాదశ పీఠవాసినీ
అష్టైశ్వర్య ప్రదాయినీ
ఇష్టదైవమా శివతరుణీ
సాష్టాంగనతులు జననీ..

(1) లంకాపీఠికలో శాంకరీ
కాంచీభూమినికామాక్షీ
ప్రద్యుమ్నమ్మున శ్రుంగలాదేవి
క్రౌంచపట్టణపు చాముండీ
అలంపురములో జోగులాంబా
శ్రీశైలమ్మున భ్రమరాంబా
కొల్హాపురమున మహాలక్ష్మీ
మాపూర్యఏకవీరికా!!
(2) ఉజ్జయినీపురి మహాకాళికా
పీఠాపుర పురుహూతికా
ఓఢ్యానమ్మున గిరిజాదేవి
దక్షవాటి మాణిక్యాంబా
హరిక్షేత్రమున కామాఖ్యా
శ్రీప్రయాగమాధవీశ్వరీ
జ్వాలాక్షేత్రనివాసినివైష్ణవి
గయలోసర్వమంగళా!!
(3) కాశీపురిలో విశాలాక్షీ
కాశ్మీరములో సరస్వతీ
అఖండవైభవసంధాయిని
అనంతరూపా విలాసినీ
ఆదిశక్తి జగదాదిమ జననీ
ఆదుకొనుమ శృతి శిఖరమణి
అష్టాపదసింహాసిని గౌరీ కష్టతమస్సంహారిణీ!!

0 comments:

Post a Comment