Pages

Subscribe:

Friday 8 November 2013

ముద్దబంతిపూలు పెట్టి

    

ముద్ద బంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను చుట్టి
హంసలా నడిచి వచ్చే చిట్టెమ్మా
మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా
అద్దమంటి మనసు ఉంది అందమైన వయసు ఉంది
ఇంతకన్నా ఉండేది ఏంది కిట్టయ్యా
ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా

1. పుట్టింటి అరణాలూ ఘనమైన కట్నాలూ అత్తవారింటి నిండా వేచినా
అవి అభిమానమంత విలువ జేతునా !!ముద్ద!!
అభిమానమాభరణం మరియాదే భూషణం
గుణము మంచిదైతే చాలయా
మన గొప్పతనము చెప్పుకోను వీలయ్యా !!అద్దమంటి!!

2. కాలు చెయ్యి లోపమనీ కొక్కరాయి రూపమనీ
వదినలు నన్ను గేలి చేతురా పిల్లను దెచ్చి పెళ్లి జేతురా
ఎవరేమి అన్ననేమి ఎగతాళి చేయ్యనేమి
నవ్విన నాప చేనే పండదా
నలుగురు మెచ్చు రోజు ఉండదా !!అద్దమంటి!! 

0 comments:

Post a Comment