Pages

Subscribe:

Monday 18 November 2013

వేణువై వచ్చాను భువనానికి

                    
చిత్రం : మాతృదేవో భావ
గానం : చిత్ర
రచన : వేటూరి
సంగీతం :కీరవాణి

వేణువై వచ్చాను భువనానికి గాలినైపోతాను గగనానికి
వేణువై వచ్చాను భువనానికి గాలినైపోతాను గగనానికి
మమతలన్నీ మౌనగానం వాంఛలన్నీ వాయులీనం
వేణువై వచ్చాను భువనానికి గాలినైపోతాను గగనానికి

ఏడుకొండలకైనా అండ తానొక్కడే
ఏడు జన్మల తీపి ఈ బంధమే -2
నీ కంటిలో నలక లో వెలుగు నేననక
నేను నేననుకుంటే ఎద చీకటి హరీ హరీ.....హరీ
రాయినై ఉన్నాను ఏనాటికీ రామ పాదము రాక ఏనాటికీ!!వేణువై!!

నీరు కన్నీరాయే ఊపిరే బరువాయె
నీరు నిప్పుగ మారె నా గుండెలో
ఆ నింగిలో కలిసి నా శూన్యబంధాలు
పుట్టిల్లు చేరెను మట్టి ప్రణాలు హరీ హరీ హరీ
రెప్పనై ఉన్నాను నీ కంటికి పాపనై వస్తాను నీ ఇంటికి!!వేణువై!!

0 comments:

Post a Comment