Pages

Subscribe:

Sunday 17 November 2013

ఆవకాయ మన అందరిదీ

   
చిత్రం: మిథునం
సంగీతం: వీణాపాణి
రచన: తనికెళ్ళ భరణి
గానం: ఎస్ పి బాలు, స్వప్న


ఆవకాయ మన అందరిదీ
గోంగూర పచ్చడీ మనదేలే
ఎందుకు పిజ్జా లెందుకు బర్గర్లెందుకు
పాస్తాలింకెందుకులే!!ఆవకాయ!!


ఇడ్డెన్లలోకి కొబ్బరి చట్నీ
పెసరట్టులోకి అల్లమురా
దిబ్బ రొట్టెకీ తేనె పానకం
దొరకకపోతే బెల్లమురా
వేడి పాయసం ఎప్పటికప్పుడే
పులిహోరెపుడూ మర్నాడే
మిర్చీబజ్జీ నోరు కాలవలె
ఆవడ పెరుగున తేలవలె!!ఆవకాయ!!

గుత్తివంకాయ కూర కలుపుకొని
పాతిక ముద్దలు పీకుమురా
గుమ్మడికాయ పులుసుందంటే
ఆకులు సైతం నాకుమురా
పనకాయనీకున్నరోజునే పెద్దలు
తద్దినమన్నారు
పనసపొట్టులో ఆవపెట్టుకొని
తరతరాలుగా తిన్నారు
తిండి గలిగితే కండగలదని
గురజాడ వారు అన్నారు
అప్పదాసు ఆ ముక్క పట్టుకొని
ముప్పూటలు తెగ తిన్నారు

0 comments:

Post a Comment