Pages

Subscribe:

Monday 18 November 2013

పిలిచిన మురళికి

  
చిత్రం : ఆనందభైరవి (1984)
రచన : వేటూరి
సంగీతం : రమేష్‌నాయుడు
గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి

పిలిచిన మురళికి వలచిన మువ్వకిఎదలో ఒకటే రాగం
అది ఆనందభైరవి రాగం
మురిసిన మురళికి మెరిసిన మువ్వకి ఎదలో ప్రేమపరాగం
మది ఆనందభైరవి రాగం

కులికే మువ్వల అలికిడి వింటే కళలే నిద్దుర లేచే
కులికే మువ్వల అలికిడి వింటే కళలే నిద్దుర లేచే
మనసే ముర ళి ఆలాపనలో మధురానగరిగ తోచే
యమునా నదిలా పొంగినది స్వరమే వరమై సంగమమై
మురిసిన మురళికి మెరిసిన మువ్వకి ఎదలో ప్రేమపరాగం
మది ఆనందభైరవి రాగం
పిలిచిన మురళికి వలచిన మువ్వకి ఎదలో ఒక టే రాగం
అది ఆనందభైరవి రాగం

ఎవరీ గోపిక పదలయ వింటే ఎదలో అందియ మ్రోగే
పదమే పదమై మదిలో ఉంటే ప్రణయాలాపన సాగే
హృదయం లయమై పోయినదీ లయలే ప్రియమై జీవితమై
మురిసిన మురళికి మెరిసిన మువ్వకి ఎదలో ప్రేమపరాగం
మది ఆనందభైరవి రాగం
పిలిచిన మురళికి వలచిన మువ్వకి ఎదలో ఒక టే రాగం
అది ఆనందభైరవి రాగం

0 comments:

Post a Comment