Pages

Subscribe:

Monday 18 November 2013

నీచరణ కమల నీడయే చాలు

                    
నీ చరణ కమలాల నీడయే చాలు ఎందుకోయీ స్వామి బృందావనాలు 2సార్లు
నీ నయన కమలాల నేనున్న చాలు ఎందుకే ఓ దేవీ నందన వనాలు 2సార్లు

౧. నును మోవి చివురుపై నను మురళిగా మలచి పలికించరా
పలికించరా మధువు లొలికించరా
మోవిపై కనరాని మురళిలో వినలేని రాగాలు పలికింతునే 2సార్లు
మధురానురాగాలు చిలికింతునే
నీ ప్రణయ వనిలోన నేనున్న చాలు ఎందుకోయీ స్వామి నందనవనాలు
నీ హృదయ గగనాన నేనున్న చాలు ఎందుకే ఓ దేవి బృందావనాలు

౨. తులసీ దళాలలో తొలివలపులందించి 2సార్లు 
 పూజింతునా
పూజింతు నా స్వామి పులకింతునా
పూజలను గ్రహియించి పులకింతలందించి 2సార్లు
లోలోన రవళింతునే 2సార్లు
ఓ దేవి నీలోన నివసింతునే 2సార్లు!!నీచరణ!!
పూజింతునా

పూజింతు నా స్వామి పులకింతునా
పూజలను గ్రహియించి పులకింతలందించి 2సార్లు
లోలోన రవళింతునే 2సార్లు
ఓ దేవి నీలోన నివసింతునే 2సార్లు!!నీచరణ!!





0 comments:

Post a Comment