Pages

Subscribe:

Sunday 17 November 2013

కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదానా

                      
చిత్రం: తోడికోడళ్ళు
సంగీతం: మాస్టర్ వేణు
రచన: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల


కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదాన
బుగ్గమీద గులాబిరంగు ఎలా వచ్చెనో చెప్పగలవా || 2 ||
నిన్నుమించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే || 2 ||
వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చిచేరెను తెలుసుకో ||| కారులో |||
చలువరాతి మేడలోన కులుకుతావే కుర్రదానా || 2 ||
మేడగట్టిన చలువరాయి ఎలా వచ్చెనో చెప్పగలవా
కడుపుకాలే కష్టజీవులు ఒడలు విరిచి గనులు తొలిచి || 2 ||
చమట చలువను చేర్చి రాళ్ళను తీర్చినారు తెలుసుకో
కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదాన
నిలిచి విను నీ బడాయి చాలు తెలుసుకో ఈ నిజానిజాలు

గాలిలోన తేలిపోయే చీరగట్టిన చిన్నదానా || 2 ||
జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా
చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు || 2 ||
చాకిరొకరిది సౌఖ్యమొకరిది సాగదింక తెలుసుకో
కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదాన
నిలిచి విను నీ బడాయి చాలు తెలుసుకో ఈ నిజానిజాలు




0 comments:

Post a Comment