Pages

Subscribe:

Monday 18 November 2013

కంటేనే అమ్మ అని అంటే ఎలా

     
చిత్రం : ప్రేమించు (2001)
సంగీతం : ఎం.ఎం.శ్రీలేఖ
రచన : సి.నారాయణరెడ్డి
గానం : ఎస్.పి.బాలు, చిత్ర
ప.  కంటేనే అమ్మ అని అంటే ఎలా (2)
కరుణించే ప్రతి దేవత అమ్మే కదా
కన్న అమ్మే కదా
కంటేనే అమ్మ అని అంటే ఎలా (2)
కడుపుతీపి లేని అమ్మ బొమ్మే కదా
రాతి బొమ్మే కదా
౧.  కణకణలాడే ఎండకు శిరుసుమాడినా
మనకు తన నీడను అందించే చెట్టే అమ్మ
చారెడు నీళ్లయిన తాను దాచుకోక
జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మ
ఆ అమ్మలనే మించిన మా అమ్మకు (2)
రుణం తీర్చుకోలేను ఏ జన్మకూ ॥
౨.  ఎన్నో అంతస్తులుగా ఎదిగిపోయినా
మేడకున్న అసలు ఉనికి ఆ పునాది పైనే
సిరుల జల్లులో నిత్యం పరవశించినా
మగువ జీవన సాఫల్యం మాతృత్వంలోనే
ప్రతి తల్లికి మమకారం పరమార్థం (2)
అది లేని అహంకారం వ్యర్థం వ్యర్థం
కరుణించే ప్రతి దేవత అమ్మే కదా
కడుపుతీపి లేని అమ్మ బొమ్మే కదా
రాతి బొమ్మే కదా

0 comments:

Post a Comment