Pages

Subscribe:

Monday 18 November 2013

అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా

        
చిత్రం : సాక్షి
గానం : సుశీల
రచన : ఆరుద్ర
సంగీతం: కె.వి.మహదేవన్

అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా బతకరా బతకరా పచ్చగా
నీకు నేనుంటా వెయ్యేళ్ళు తోడుగా నీడగా

నా మెడలో తాళిబొట్టు కట్టరా నా నుదటా నిలువు బొట్టు పెట్టరా
నీ పెదవి మీద సిరునవ్వు చెరగదురా నీ సిగపూవుల రేకైనా
వాడదురా వాడదురా బతకరా బతకరా పచ్చగా || అమ్మకడుపు ||

చల్లని అయిరేణికి మొక్కరా సన్నికల్లు మీదకాలు తొక్కరా
చల్లనేళ కంటనీరు వద్దురా నా నల్ల పూసలే నీకు
రక్షరా రక్షరా బతకరా బతకరా పచ్చగా || అమ్మకడుపు ||

నా కొంగు నీ చెంగూ ముడివేయరా నా చేయీ నీ చేయీ కలపరా
ఏడడుగులు నాతో నడవరా ఆ యముడైనా మనమద్దికి
రాడురా రాడురా బతకరా బతకరా పచ్చగా || అమ్మకడుపు ||

0 comments:

Post a Comment