Pages

Subscribe:

Sunday 17 November 2013

శ్రీరామ సుగుణధామ

    
చిత్రం: లవకుశ
సంగీతం:: ఘంటసాల
రచన:: సదాశివబ్రహ్మం
గానం:: పి.సుశీల, పి.లీల

రామ సుగుణధామా రఘువంశజలధిసోమా
శ్రీరామ సుగుణధామా
సీతామనోభిరామా సాకేతసార్వభౌమా
శ్రీరామ సుగుణధామా
మందస్మిత సుందర వదనారవింద రామా
ఇందీవర శ్యామలాంగ వందితసుత్రామా
మందార మరందోపమ మధురమధురనామా
మందార మరందోపమ మధురమధురనామా
శ్రీరామ సుగుణధామా రఘువంశజలధిసోమా
శ్రీరామ సుగుణధామా
అవతారపురుష రావణాది దైత్యవిరామా
నవనీత హృదయ ధర్మనిరతరాజలరామా
పవమానతనయ సన్నుత పరమాత్మ పరంధామా
పవమానతనయ సన్నుత పరమాత్మ పరంధామాశ్రీరామ సుగుణధామా రఘువంశజలధిసోమా
సీతామనోభిరామా ...సాకేతసార్వభౌమాసీతామనోభిరామా








0 comments:

Post a Comment