Pages

Subscribe:

Sunday 17 November 2013

మౌనమేలనోయి

                      
చిత్రం: సాగర సంగమం
సంగీతం: ఇళయరాజా
రచన: వేటూరి
పాడినవారు: S.P.బాలు, S.జానకి
ఆ..ఆ ఆ ఆఆ.. ఆ..ఆ ఆఆ..ఆ
మౌనమేలనోయి.. ఈ మరపురాని రేయి
మౌనమేలనోయి.. ఈ మరపురాని రేయి

ఎదలో వెన్నెల.. వెలిగే కన్నుల
ఎదలో వెన్నెల.. వెలిగే కన్నుల
తారాడే హాయిలో..

ఇంత..మౌనమేలనోయి.. ఈ మరపురాని రేయి
పలికే పెదవి వణికింది ఎందుకో
వొణికే పెదవి వెనకాల ఏమిటో

కలిసే మనసులా.. విరిసే వయసులా
కలిసే మనసులా.. విరిసే వయసులా
నీలి నీలి ఊసులు.. లేతగాలి బాసలు..
ఏమేమో అడిగినా

మౌనమేలనోయి.. ఈ మరపురాని రేయి

హిమమే కురిసే వందమామ కౌగిట
సుమమే విరిసే వెన్నెలమ్మ వాకిట

ఇవి ఏడడుగులా.. వలపు మడుగులా
ఇవి ఏడడుగులా.. వలపు మడుగులా
కన్నె ఈడు ఉలుకులు.. కంటిపాప కబురులు..
ఎంతెంతో తెలిసినా..

మౌనమేలనోయి.. ఈ మరపురాని రేయి
ఇంత..మౌనమేలనోయి.. ఈ మరపురాని రేయి

ఎదలో వెన్నెల.. వెలిగే కన్నుల
ఎదలో వెన్నెల.. వెలిగే కన్నుల
తారాడే హాయిలో..

ఇంత..మౌనమేలనోయి.. ఈ మరపురాని రేయి

0 comments:

Post a Comment