Pages

Subscribe:

Sunday 17 November 2013

ఆటగదరా శివా ఆటగద కేశవా

             
చిత్రం : మిథునం (2012)
సంగీతం : స్వర వీణాపాణి
రచన : తనికెళ్ళ భరణి
గానం : కె. జె. ఏసుదాసు

ఆటగదరా శివా ఆటగద కేశవా
ఆటగదరా శివా ఆటగద కేశవా
ఆటగదరా నీకు అమ్మతోడు
ఆటగదరా శివా ఆటగద కేశవా
ఆటగద జననాలు ఆటగద మరణాలు
మధ్యలో ప్రణయాలు ఆటనీకు
ఆటగద సొంతాలు ఆటగద పంతాలు
ఆటగద సొంతాలు ఆటగద పంతాలు
ఆటగద అంతాలు ఆటనీకు!!ఆటగదరా శివా!!

ఆటగదరా నలుపు ఆటగదరా తెలుపు
నలుపు తెలుపుల గెలుపు ఆట నీకు
ఆటగదరా మన్ను ఆటగదరా మిన్ను
ఆటగదరా మన్ను ఆటగదరా మిన్ను
మిధ్యలో ఉంచి ఆడేవు నన్ను!!ఆటగదరా శివా!!





0 comments:

Post a Comment