Pages

Subscribe:

Tuesday 19 November 2013

అపరింజి మదనుడే అనువైన సఖుడులే

                  


చిత్రం: మెరుపుకలలు
సంగీతం: ఏ . ఆర్ . రెహమాన్
గానం : అనురాధా శ్రీరామ్
రచన: వేటూరి సుందర రామమూర్తి
అపరంజి మదనుడే అనువైన సఖుడులే
అతడేమి అందగాడే...
వరిచేల మెరుపులా వజ్రమై రత్నమై
వచ్చె వలపంటివాడే...
వినువీధిలో ఉండే సూర్యదేవుడునే
ఇల మీద ఒదిగినాడే
కన్నీటి గాయాలు చన్నీటితో కడుగు
శిశుపాలుడొచ్చినాడే
అపరంజి మదనుడే అనువైన సఖుడులే
అతడేమి అందగాడే...అతడేమి అందగాడే...
పోరాట భూమినే పూదోట కోనగా
పులకింప జేసినాడే...పులకింప జేసినాడే...!!
కల్యారి మలమేలు కలికి ముత్యపు రాయి
కన్న బిడ్డతడు లేడే..
నూరేళ్ళ చీకటి ఒకనాడే పోగొట్టి
ఒడిలోన చేరినాడే..
ఇరుకైన గుండెల్లో అనురాగమొలకగా
ఇలబాలుడొచ్చినాడే
ముక్కారు కాలమ్ము పుట్టాడు పూజకై
పుష్పమై తోడు నాకై..




0 comments:

Post a Comment