Pages

Subscribe:

Monday 18 November 2013

పలికే గోరింకా చూడవె నావంకా

    
చిత్రం: ప్రియురాలు పిలిచింది
సంగీతం: ఎ ఆర్ రెహమాన్
రచన: ఎ ఎమ్ రత్నం, శివగణేశ్
గానం: సాధనా సర్గమ్

పలికే గోరింకా చూడవే నా వంక ఇక వినుకో నా మది కోరికా
పలికే గోరింకా చూడవే నా వంక ఇక వినుకో నా మది కోరికా
అహ నేడే రావాలి నా దీపావళి పండగ
నేడే రావాలి నా దీపావళి పండగ
రేపటి స్వప్నాన్నీ నేనెట్టా నమ్మేది
నే నాటితే రోజా నేడే పూయులే

పగలే ఇక వెన్నెలా..హే
పగలే ఇక వెన్నెల వస్తే పాపమా
రేయిలో హరివిల్లే వస్తే నేరమా
బదులివ్ ఇవ్ ఇవ్ మదిలో జివ్ జివ్ జివ్
బదులివ్ ఇవ్ ఇవ్ మదిలో జివ్ జివ్ జివ్
కొంచెం ఆశ కొన్ని కలలు కలిసుండేదే జీవితం
నూరు కలలను చూచినచో ఆరు కలలైన ఫలియుంచు
కలలే దరీ చేరవా..

నా పేరే పాటగ కోయిలే పాడని
నే కోరి నట్టుగ పరువం మారని
భర తంతంతం మదిలో తోంతోంధీం
భర తంతంతం మదిలో తోంతోంధీం
చిరుగాలి కొంచం వచ్చి నా మోమంత నిమరని
రేపు అన్నది దేవుడికి నేడు అన్నది మనుషులకు
బ్రతుకే బ్రతికేందుకు

అహ నేడే రావాలి నా దీపావళి పండగ
నేడే రావాలి నా దీపావళి పండగ
రేపటి స్వప్నాన్నీ నేనెట్టా నమ్మేది
నే నాటితే రోజా నేడే పూయులే

0 comments:

Post a Comment