Pages

Subscribe:

Friday 25 October 2013

మురిపించే అందాలే అవినన్నే చెందాలే

             
చిత్రం: బొబ్బిలి యుద్ధం
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
రచన: శ్రీ శ్రీ
గానం: ఘంటసాల, సుశీల

సాకీ:  సొగసు కీల్జడదానా...సోగకన్నులదానా
వజ్రాలవంటి పల్వరుసదానాబంగారు జిగిదానా...
సింగారములదానా...నయమైన వయ్యారి నడలదాన...
తోరంపుకటిదానాతొణకు సిగ్గులదానా
పిడికిట నడగు నెన్నడుముదానా... ...

: మురిపించే అందాలే అవి నన్నే చెందాలే
నా దానవు నీవేలే నీ వాడను నేనేలే ...
దరిచేర రావే సఖీ నా సఖీ...ప్రేయసీ సిగ్గేలా

మరపించే మురిపాలే కరిగించే కెరటాలై (2)
నిదురించే భావాల కదిలించే ఈవేళ... ...
అదే హాయి కాదా సఖా నా సఖా...!!మురిపించే!!

౧. చెలి తొలిచూపే మంత్రించెనే
ప్రియ సఖురూపె మదినేలెనే
ఇది ఎడబాటు కనలేని ప్రేమ
ఇల మనకింక సురలోక సీమ
ఇదే హాయి కాదా సఖా నా సఖా...!!మురిపించే!!

: అనురాగాల రాగాలలో...
నయగారాల గారాలలో...
మధు మాధుర్యమే నిండిపోయె
హృదయానందమే పొంగిపోయె
దరిచేర రావే సఖీ నా సఖీ...!!మురిపించే!!

0 comments:

Post a Comment