Pages

Subscribe:

Tuesday 22 October 2013

అదే నీవు అదే నేను అదే గీతం పాడనా

                                        


చిత్రం : అభినందన (1988)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : ఇళయరాజా
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

ప: అదే నీవు అదే నేను అదే గీతం పాడనా
అదే నీవు అదే నేను అదే గీతం పాడనా
కథైనా కలైనా కనులలో చూడనా
అదే నీవు అదే నేను అదే గీతం పాడనా
అదే నీవు అదే నేను అదే గీతం పాడనా

౧. కొండ కోన గుండెల్లో ఎండ వానలైనాము
కొండ కోన గుండెల్లో ఎండ వానలైనాము
గువ్వా గువ్వ కౌగిట్లో గూడు చేసుకున్నాము
అదే స్నేహము అదే మోహము
అదే స్నేహము అదే మోహము
ఆది అంతము ఏదీ లేని గానము!!అదే!!

౨. నిన్న రేపు సందెల్లో నేడై ఉందామన్నావు
నిన్న రేపు సందెల్లో నేడై ఉందామన్నావు
కన్నీరైన ప్రేమల్లో పన్నీరవుదామన్నావు
అదే బాసగా అదే ఆశగా...అదే బాసగా అదే ఆశగా
ఎన్నినాళ్ళు నిన్నపాటే పాడను!!అదే!!


0 comments:

Post a Comment