Pages

Subscribe:

Tuesday 22 October 2013

సడిసేయకో గాలి

    


చిత్రం: రాజమకుటం
సంగీతం: మాస్టర్ వేణు
రచన: దేవులపల్లి
గానం: పి లీల
ప:  సడిసేయకో గాలి సడిసేయబోకే
బడలి ఒడిలో రాజు పవ్వళించేనే ... సడిసేయకే

౧.  రత్నపీఠిక లేని రారాజు నా స్వామి
మణికిరీటము లేని మహరాజు గాకేమి
చిలిపి పరుగులు మాని కొలిచిపోరాదే ... సడిసేయకే

౨.  ఏటి గలగలకే ఎగిరి లేచేనే
ఆకు కదలికలకే అదరి చూసేనే
నిదుర చెదరిందంటే నే నూరుకోనే ... సడిసేయకే

౩.  పండు వెన్నెల నడిగి పాన్పు తేరాదే
నీలిమబ్బుల దాగు నిదుర తేరాదే
విరుల వీవన పూని విసిరిపోరాదే ... సడిసేయకే

0 comments:

Post a Comment