Pages

Subscribe:

Tuesday 22 October 2013

ప్రేమ ఎంత మధురం

    


చిత్రం: అభినందన
సంగీతం: ఇళయరాజా
రచన: ఆచార్య ఆత్రేయ
గానం: ఎస్ పి బాలు

ప: ప్రేమ ఎంత మధురం
ప్రియురాలు అంత కఠినం
చేసినా ప్రేమ క్షీర సాగర మధనం
మింగినాను హలాహలం!!ప్రేమ!!

౧. ప్రేమించుటేనా నా దోషము
పూజించుటేనా నా పాపము
నాలోని నీరూపము నా జీవనాధారము
అది ఆరాలి పోవాలి ప్రాణము!!ప్రేమ!!

౨. నేనోర్వలేను ఈ తేజము
ఆర్పేయరాదా ఈదీపము
ఆచీకటిలో కలిసేపోయి
నా రేపటినే మరిచే పోయి
మానాలి నీధ్యానము
కావాలి నే శూన్యము
అపుడాగాలి ఈ మూగ గానము!!ప్రేమ!!

0 comments:

Post a Comment