Pages

Subscribe:

Saturday 19 October 2013

పాడవేల రాధికా

         
చిత్రం : ఇద్దరు మిత్రులు (1961)
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
రచన : శ్రీశ్రీ
గానం :  ఘంటసాలపి.సుశీల

: ... ... ... ... ... ...
పాడవేల రాధికా ప్రణయసుధా గీతిక
పాడవేల రాధికా ప్రణయసుధా గీతిక
పాడవేల రాధికా....

. వసంత యామినిలో... ... వెన్నెల వెలుగులలో... ...
వసంత యామినిలో... ... వెన్నెల వెలుగులలో... ...
జీవితమే పులకించగ...
జీవితమే పులకించగ నీ వీణను సవరించి
పాడవేల రాధికా...

. గోపాలుడు నిను వలచి నీ పాటను మది తలచి
గోపాలుడు నిను వలచి నీ పాటను మది తలచి
మూలనో పొంచి పొంచి...
మూలనో పొంచి పొంచి వినుచున్నాడని యెంచి
పాడవేల రాధికా...

. వేణుగానలోలుడు నీ వీణామృదురవము వినీ
వేణుగానలోలుడు నీ వీణామృదురవము వినీ
ప్రియమారగ నినుచేరగ
దయచేసెడి శుభవేళ
పాడవేల రాధికా ప్రణయసుధా గీతిక
పాడవేల రాధికా....



0 comments:

Post a Comment