Pages

Subscribe:

Sunday 20 October 2013

నిదురించే తోటలోకి

   
చిత్రం : ముత్యాల ముగ్గు (1975)
సంగీతం : కె.వి.మహదేవన్
రచన : గుంటూరు శేషేంద్ర శర్మ
గానం : పి.సుశీల

ప: నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది
కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది
నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది
కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది

౧. రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లింది
దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది
రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లింది
దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది
శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపింది
శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపింది
ఆకు రాలు అడవికి ఒక ఆమని దయ చేసింది!!నిదురించే!!

౨. విఫలమైన నా కోరికలు వేలాడే గుమ్మంలో
ఆశల అడుగులు వినపడి అంతలో పోయాయి
విఫలమైన నా కోరికలు వేలాడే గుమ్మంలో
ఆశల అడుగులు వినపడి అంతలో పోయాయి
కొమ్మల్లో పక్షులారా గగనంలో మబ్బుల్లారా
నది దోచుకుపోతున్న నావను ఆపండి
రేవు బావురుమంటుందని
నావకు చెప్పండి నావకు చెప్పండి!!నిదురించే!!

0 comments:

Post a Comment