Pages

Subscribe:

Tuesday 15 November 2016

చూచి చూచి కళ్ళు కాయలే కాచాయి



చిత్రం :  భార్యాభర్తలు (1961)
సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత :  శ్రీశ్రీ
నేపధ్య గానం :  ఘంటసాల, జిక్కి
పల్లవి: జో..ఓ..జో...ఓ..జోజో..
చూచి చూచి కళ్ళు కాయలే కాచాయి...
చూచి చూచి కళ్ళు కాయలే కాచాయి...
చుక్కలా నీ తండ్రి ఊడిపడ్డాడు...
చక్కనీ నా బాబు జో..జో..
చల్లని నా తండ్రి జో...జో...
రెక్కలు గట్టుకొని రివ్వునా వాలాను...
రెక్కలు గట్టుకొని రివ్వునా వాలాను...
రేయింబగళ్లు నిను తలచుకొని మురిశాను...
మురిపాల మొలకవు...జో..జో..
ముద్దులూరించేవు...జో...జో...
చూచి చూచి కళ్ళు కాయలే కాచాయి...
చుక్కలా నీ తండ్రి ఊడిపడ్డాడు...
చక్కనీ నా బాబు జో..జో..
చల్లని నా తండ్రి జో...జో...
హు..పడుకోరా...
చరణం 1: కాకితో ఒకసారి కబురంపినావనీ...
కాకితో ఒకసారి కబురంపినావనీ...
కలలోన నిను చాల కలవరించాను...
కాశికి పోయినా గంగలో మునిగినా ...
నిను మరువకున్నాను...జో..జో...
నిలువలేకున్నాను...జో..జో..
చూచి చూచి కళ్ళు కాయలే కాచాయి...
చుక్కలా నీ తండ్రి ఊడిపడ్డాడు...
చక్కనీ నా బాబు జో..జో..
చల్లని నా తండ్రి జో...జో...
ఒరేయ్....
చరణం 2: ఏ ఊర్లు తిరిగావు...ఏమేమి చేశావు?
ఏ ఊర్లు తిరిగావు...ఏమేమి చేశావు?
ఎవరితో సరదాలు తీర్చుకొచ్చావు....
ఇంత చక్కని రంభ ఇంటిలో ఉండగా...
ఇతరులతో పని ఏమి...జో..జో...
ఇది మంచి సమయము...జో..జో..


0 comments:

Post a Comment