Pages

Subscribe:

Saturday 19 November 2016

నాదవినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము

  


 చిత్రం :  సాగర సంగమం (1982)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు,  ఎస్. పి. శైలజ
సాకీ :  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే
జగతః పితరౌ.. వందే పార్వతీ పరమేశ్వరౌ !!
వందే.. పార్వతీప రమేశ్వరౌ... 
పల్లవి : నాదవినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదమూ
భావములో.. ఆ.. భంగిమలో..  ఆ.. గానములో.. ఆ.. గమకములో.. ఆ...
భావములో భంగిమలో గానములో గమకములో ఆంగికమౌ తపమీ గతి సేయగ
నాదవినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదమూ
ఆ...... ఆ...... ఆ......... 
ని మదనిని మదనిసనిని. రిసనిదని మదద గమమ రిగస
చరణం 1 : కైలాసాన కార్తీకాన శివ రూపం... ప్రమిదే లేని ప్రమదాలోక హిమదీపం
కైలాసాన కార్తీకాన శివ రూపం.. ప్రమిదే లేని ప్రమదాలోక హిమదీపం
నవరస నటనం .. ద ని స రి స ని స
జతియుత గమనం .. ద ని స రి స ని స
నవరస నటనం.. జతియుత గమనం
సితగిరి చలనం.. సురనది పయనం
భరతమైన నాట్యం .. ఆ....
బ్రతుకు నిత్య నృత్యం .. ఆ
భరతమైన నాట్యం .. ఆ....
బ్రతుకు నిత్య నృత్యం .. ఆ...
తపనుని కిరణం.. తామస హరణం
తపనుని కిరణం.. తామస హరణం
శివుని నయన త్రయలాస్యం
ధిరన ధిరననన తకిట తకిటతధిమి
ధిరన ధిరననన... నాట్యం
ధిరన ధిరననన తకిట తకిటతధిమి
ధిరన ధిరననన.. లాస్యం
నమక చమక సహజం ..ఝం
నటప్రకృతీ పాదజం .. ఝం
నర్తనమే శివకవచం .. చం
నటరాజ పాద సుమ రజం .. ఝం
ధిరనన ధిరనన ధిరనన ధిరననధిర ధిర ధిర ధిర ధిర ధిర..

0 comments:

Post a Comment