Pages

Subscribe:

Saturday 19 November 2016

నువ్వేనా సంపంగి పువ్వున నువ్వేనా



చిత్రం: గుప్పెడు మనసు (1979)
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: బాలు
పల్లవి: నువ్వేనా సంపంగి పువ్వున నువ్వేనా
నువ్వేనా సంపంగి పువ్వున నువ్వేనా
జాబిలి నవ్వున నువ్వేనా
గోదారి పొంగున నువ్వేనా నువ్వేనా
చరణం 1: నిన్నేనా.. అది నేనేనా కల గన్నానా..  కనుగొన్నానా
నిన్నేనా.. అది నేనేనా
కల గన్నానా.. కనుగొన్నానా
అల్లిబిల్లి పదమల్లేనా అది అందాల పందిరి వేసేనా
అల్లిబిల్లి పదమల్లేనా అది అందాల పందిరి వేసేనా
చరణం 2: కళ్ళేనా ..  హరివిల్లేనా అది చూపేనా విరితూపేనా
కళ్ళేనా హరివిల్లేనా అది చూపేనా విరితూపేనా
తుళ్ళీ తుళ్ళీ పడు వయసేనా నను తొందర వందర చేసేనా
తుళ్ళీ తుళ్ళీ పడు వయసేనా నను తొందర వందర చేసేనా
చరణం 3: నువ్వైనా.. నీ నీడైనా
ఏ నాడైనా ... నా తోడౌనా
నువ్వైనా నీ నీడైనా ఏ నాడైనా నా తోడౌనా
మళ్ళీ మళ్ళీ కల వచ్చేనా ఇలా మల్లెల మాపై విచ్చేనా
మళ్ళీ మళ్ళీ కల వచ్చేనా ఇలా మల్లెల మాపై విచ్చేనా

0 comments:

Post a Comment